బంజారాల సంస్కృతి గొప్పది
బంజారాల సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని, వాటిని మరవకూడదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బంజారా నాయకుడు బానోత్ మహేందర్ అధ్యక్షతన నిర్వహించిన తీజ్ ముగింపు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
- కేసీఆర్ పాలనలో లంబాడీలకు గుర్తింపు
- సేవాలాల్ భవనానికి నిధులు మంజూరు
- తీజ్ ముగింపు ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి, సెప్టెంబర్ 3 : బంజారాల సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని, వాటిని మరవకూడదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బంజారా నాయకుడు బానోత్ మహేందర్ అధ్యక్షతన నిర్వహించిన తీజ్ ముగింపు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ బంజారాల కట్టు, బొట్టు అందంగా ఉంటుందన్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో బంజారాలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నాడని, అందుకే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావుతో కేసులు వేయించాడని మండిపడ్డారు. వారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రేవంత్‌ను డిమాండ్ చేశారు. లంబాడీల మీద కోపంతోనే రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో ఇప్పటి వరకు చోటు కల్పించలేదన్నారు. తండాలను జీపీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. హైదరాబాద్‌లో 5 ఎకరాల్లో బంజారా భవన్ నిర్మించామన్నారు.
పాలకుర్తిలో తాను మంత్రిగా ఉన్నప్పుడు సేవాలాల్ భవనానికి రూ. 4 కోట్లు మంజూరు చేశానన్నారు. పాలకుర్తికి ఓ ప్రత్యేక చరిత్ర ఉందని, మహా కవులను కన్న పుణ్యభూమి అన్నారు. పాలకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులను పోలీసులు వేధింపులకు గురి చేయడం తగదని, వారు తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని, నాయకులు కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్న పోలీసు అధికారులపై చర్యలు తప్పవన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి 420 హామీలు, ఆరు గ్యారెంటీలతో ప్రజలు మోసపోయారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్రామిరెడ్డి, పాకనాటి సునీల్‌రెడ్డి, పుస్కూరి శ్రీనివాస్‌రావు, పార్టీ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్, జర్పుల బాలునాయక్, లకావత్ సురేశ్, వెంకట్, నాగరాజు, దీకొండ వెంకటేశ్వర్రావు, భూక్యా శ్రీనివాస్, జై సింగ్, రాంసింగ్ నాయక్, గర్వందుల మల్లేశ్, ధరావత్ మహేశ్, గాంధీనాయక్, మాచర్ల ఎల్లయ్య, ధరావత్ యాకూబ్‌నాయక్, బానోత్ మహేందర్, బాలునాయక్, దేవేందర్, భూక్యా తిరుపతి, గిరిజనులు పాల్గొన్నారు. కాగా, గిరిజన గాయకుడు బిక్షునాయక్ పాటలు అలరించాయి.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

