న్యూఢిల్లీ: రాష్ట్ర హోదా సహా వివిధ డిమాండ్లపై లద్దాఖ్‌లో నెలకొన్న సంక్షోభం నివురుగప్పిన నిప్పులా తయారైంది. అక్టోబర్ 6న కేంద్రంతో జరగాల్సిన చర్చల్ని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ‘లెహ్ అపెక్స్ బాడీ’ (ఎల్ఏబీ) తాజాగా ప్రకటించింది. నిరసనకారులపై దేశ వ్యతిరేకుల ముద్ర వేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఎల్ఏబీ సోమవారం డిమాండ్ చేసింది.
సెప్టెంబర్ 24న పోలీస్ కాల్పుల్లో నలుగురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా, మరో 90మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ దర్యాప్తు జరపాలని ఎల్ఏబీ కోరుతున్నది. ఎల్ఏబీ, కేడీఏ (కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్) రాష్ట్ర హోదాపై పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపడుతున్నాయి.