Bishnoi Gang | లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు షాక్.. ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా..!
Bishnoi Gang | కెనడా ప్రభుత్వం బిష్ణోయ్ గ్యాంగ్‌కు షాక్ ఇచ్చింది. బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ మేరకు కెనడా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒక నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని.. బెదిరింపులకు బెదిరింపు వాతావరణాన్ని సృష్టించే.. హింస, ఉగ్రవాద చర్యలకు కెనడాలో చోటు లేదని ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ఈ
Bishnoi Gang | కెనడా ప్రభుత్వం బిష్ణోయ్ గ్యాంగ్‌కు షాక్ ఇచ్చింది. బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ మేరకు కెనడా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒక నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని.. బెదిరింపులకు బెదిరింపు వాతావరణాన్ని సృష్టించే.. హింస, ఉగ్రవాద చర్యలకు కెనడాలో చోటు లేదని ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్ గ్యారీ ఆనంద్ సంగారి కెనడా ప్రభుత్వం బిష్ణోయ్ గ్యాంగ్‌ను క్రిమినల్ కోడ్ కింద ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చిందని ప్రకటించారు. కెనడాలోని ప్రతి వ్యక్తికి వారి ఇంట్లో, సమాజంలో సురక్షితంగా ఉండే హక్కు ఉందని.. బిష్ణోయ్ గ్యాంగ్ భయం, హింస ద్వారా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించారు. ఈ ముఠాను ఉగ్రవాద జాబితాలో ఉంచడం వల్ల వారి నేరాలను అరికట్టడానికి, సమాజంలో భద్రతను నిర్ధారించడానికి సమర్థవంతమైన అవకాశం ఉంటుంది. క్రిమినల్ కోడ్ కింద కెనడాలో ప్రస్తుతం మొత్తం 88 ఉగ్రవాద సంస్థలు జాబితా అయ్యాయి.
క్రిమినల్ కోడ్ ప్రకారం.. కెనడాలోని బిష్నోయ్ ముఠాల ఆస్తులు, వాహనాలు, డబ్బును స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. లేదంటే స్తంభింపజేసే ఛాన్స్ ఉంది. ఈ ముఠాలపై చర్యలు తీసుకోవడానికి చట్టబద్ధ సంస్థలకు అధికారం లభిస్తుంది. కెనడా. విదేశాల్లో ఎవరైనా ఉగ్రవాద సంస్థ ఆస్తులతో సంబంధం కలిగి ఉండడం చట్టవిరుద్ధం. కెనడాలోకి ప్రవేశం కల్పించేందుకు.. లేదంటే తిరస్కరించేందుకు ఇమ్మిగ్రేషన్, సరిహద్దు అధికారులు కూడా ఈ జాబితాను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కెనడియన్ ప్రభుత్వం ప్రకారం.. బిష్ణోయ్ గ్యాంగ్ చాలా ప్రాంతాల్లో చురుగ్గా ఉంది. హత్య, కాల్పులకు గ్యాంగ్ పాల్పడుతున్నది. దోపిడీ, బెదిరింపులతో భయానక పరిస్థితులు సృష్టిస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ప్రముఖులు, వ్యాపారులతో పాటు పలువురిని లక్ష్యంగా చేసుకొని ఆయా సమాజాల్లో అభద్రతా వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లు ఆరోపించింది. బిష్నోయ్ ముఠాను ఉగ్రవాద జాబితాలో చేర్చడం వల్ల కెనడియన్ భద్రత, నిఘా, ఆయా విభాగాలు నేరాలను ఎదుర్కొనేందుకు అవకాశంతో పాటు భద్రతంగా ఉంటారని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

