Karur Stampede : తమిళనాడులోని కరూర్ (Karur)లో తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నలభై మంది మృతికి కారణమైనందున టీవీకే కరూర్ జిల్లా సెక్రటరీని అరెస్ట్ చేశారు. తొక్కిసలాటకు బాధ్యుడిగా భావిస్తున్న మథియజగన్ను హత్యానేరం, కుట్రకోణం, ప్రజల భద్రతకు ముప్పు కలిగించారనే నెపంతో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కరూర్ తొక్కిసలాటకు నటుడు, టీవీకే అధినేత విజయ్ (Vijay) కూడా ఒక కారణమని పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. విజయ్ కావాలనే ర్యాలీకి ఆలస్యంగా వచ్చారని, దాంతో ఆయనను చూసేందుక జనం ఎగబడడంతో తొక్కిసలాట జరిగిందని తమ నివేదికలో పేర్కొన్నారు.
Breaking ‼️🚨
TVK’s Karur district secretary – Mathiyazhagan has been arrested. pic.twitter.com/Qdxb3WbQ2D
— Flim Updates⚕️ (@Dasarathan_1720) September 29, 2025
టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Stampede)లో మృతుల సంఖ్య 41కి చేరింది. 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దురదృష్టకరమైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin) ప్రభుత్వం నష్టపరిహారాన్ని(Exgratia) ప్రకటించింది. మరణించిన వాళ్ల కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారంగా చెల్లిస్తామని తెలిపింది.