Akkineni Nagarjuna | టాలీవుడ్ నటి సమంతపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కొండా సురేఖ కామెంట్స్‌పై క్రిమినల్ కేసుతోపాటు, పరువు నష్టం దావా విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు నాగార్జున, అమల, నాగచైతన్యతోపాటు సుప్రియ, వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
కోర్టు నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. మా కుటుంబానికి మంచి పేరు, ప్రతిష్టలున్నాయి. కొండా సురేఖ నా కుటుంబంపై అమర్యాదకరంగా.. నాగచైతన్య, సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లింది. మంత్రి చేసిన కామెంట్స్ అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి కామెంట్స్ చేశారు. ఈ వార్తలు అన్ని చానెళ్లు, పేపర్లలో వచ్చాయి. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు నివేదించాడు.
పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది. ఇవాళ నాగార్జున, సాక్షి సుప్రియ స్టేట్మెంట్స్ రికార్డు చేయగా.. 10న మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు.
Read Also :
Akkineni Nagarjuna | నాంపల్లి కోర్టుకు నాగార్జున ఫ్యామిలీ.. ఎవరెవరు వచ్చారంటే..?
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!
Ravi Teja | ఏంటీ ఇలాంటి టైంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?
NTRNeel | ఒకే పార్ట్‌లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరంటే.?