Salaar 2 | ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్ సలార్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో గ్లోబల్ స్టార్ హీరో టైటిల్ రోల్లో నటిస్తోన్న సలార్ రెండు పార్టులుగా వస్తుండగా.. సలార్ పార్టు 1 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కాగా ఇప్పుడిక మూవీ లవర్స్, అభిమానుల ఫోకస్ అంతా సీక్వెల్ సలార్ 2 (Salaar 2)పైనే ఉంది.
సినిమా కొత్త అప్డేట్ గురించి ఎదురుచూస్తున్న వారి కోసం అదిరిపోయే వార్త అందించింది ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితా రెడ్డి. ఫస్ట్ పార్ట్‌లో వచ్చే కాటేరమ్మ ఫైట్ సీన్‌ను మించిపోయేలా టన్నెల్ ఫైట్ ఉండబోతుందని చెప్పి సీక్వెల్‌పై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. తాజా టాక్ ప్రకారం ప్రస్తుతం టన్నెల్ ఫైట్ సీక్వెన్స్‌కు సంబంధించిన చిత్రీకరణ కొనసాగుతుందట. ఇందుకు సంబంధించిన స్టిల్స్ కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడం పక్కా అయిపోయినట్టేనని ఈ ఒక్క వార్త చెప్పేస్తుందంటున్నారు సినీ జనాలు.
సలార్ ప్రాంఛైజీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తుండగా.. శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సలార్ 2లో శ్రియా రెడ్డి, టిన్ను ఆనంద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సలార్ 2ను 2025 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. సీక్వెల్లో మరో మలయాళ స్టార్ యాక్టర్ షైన్ టామ్ చాకో కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also :
Chiranjeevi | పాపులర్ టూరిజం స్పాట్లో ఖరీదైన ప్రాపర్టీ కొన్న చిరంజీవి..!
Ravi Teja | ఏంటీ ఇలాంటి టైంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?
NTRNeel | ఒకే పార్ట్‌లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరంటే.?
Good Bad Ugly | అజిత్‌కుమార్‌తో సునీల్ సెల్ఫీ.. ఇంతకీ ఎక్కడున్నారో మరి..!