Chiranjeevi | సాధారణంగా సెలబ్రిటీలు తమ అభిరుచులకు తగ్గట్టుగా ఫామ్‌హౌజ్‌లు ఏర్పాటు చేసుకోవడం కొత్తేమీ కాదు. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి ముందు వరుసలో ఉంటాడు స్టార్ యాక్టర్ చిరంజీవి (Chiranjeevi) . ఇప్పటికే పలు చోట్ల ఫామ్‌హౌస్‌లు డిజైన్ చేయించుకున్న చిరు ఖాతాలో తాజాగా మరో అందమైన స్థలం చేరిపోయిందన్న వార్త ఒకటి టాలీవుడ్లో రౌండప్ చేస్తోంది.
లేటెస్ట్గా చిరంజీవి తమిళనాడులోని పాపులర్ టూరిజం స్పాట్ (ooty) ఊటీలో కొండపైన 6 ఎకరాల ప్రాపర్టీని కొనుగోలు చేశాడని ఇన్సైడ్ టాక్. ఇందుకోసం చిరు ఏకంగా రూ.16 కోట్లు వెచ్చించాడట. ఈ స్థలంలో చిరంజీవి ఓ ఫామ్‌హౌజ్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. అంతేకాదు ఈ ప్రదేశాన్ని ఇప్పటికే సందర్శించిన రాంచరణ్-కొణిదెల ఉపాసన.. నిర్మాణం కోసం అవసరమైన కొన్ని ఇన్పుట్స్ కూడా ఇచ్చారని టాక్.
ఇదిలా ఉంటే చిరంజీవికి ఇప్పటికే బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని దేవనహల్లిలో ఓ ఫామ్ హౌజ్ కూడా ఉందని తెలిసిందే. హాలీడేస్, ఫెస్టివల్ సీజన్లలో కుటుంబంతో కలిసి అక్కడ సరదా సమయాన్ని ఆస్వాదిస్తుంటాడు.
Read Also :
SSMB 29 | మహేశ్ బాబు నయా స్టిల్స్‌తో ఎస్ఎస్ఎంబీ 29 సినిమాపై సూపర్ హైప్
Euphoria | 2 దశాబ్ధాలు.. మళ్లీ తెరపైకి గుణశేఖర్ ఒక్కడు కాంబినేషన్..!
Committee Kurrollu | సెలబ్రేషన్స్ టైం.. కమిటీ కుర్రోళ్లు ఖాతాలో అరుదైన పురస్కారం
Siddu Jonnalagadda | జాక్ షూట్ గురించి చెప్పిన సిద్ధు జొన్నలగడ్డ