Euphoria | టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) కాంపౌండ్ నుంచి కొత్త సినిమా వస్తుందని తెలిసిందే. యుఫోరియా (Euphoria) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షార్ట్ టైటిల్ వీడియో ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. హోం బ్యానర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్‌పై నీలిమ గుణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి చాలా కాలానికి ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. మళ్లీ 2 దశాబ్ధాల తర్వాత ఒక్కడు కాంబినేషన్ రిపీట్ కాబోతుంది.
ఏంటా కాంబినేషన్ అనే కదా మీ డౌటు. ఒక్కడు డైరెక్టర్ గుణ్ శేఖర్, హీరోయిన్ భూమిక మరోసారి ఈ సినిమాకు కలిసి పనిచేయబోతున్నారట. యుఫోరియాలో భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్టర్‌ను షేర్ చేస్తూ పరోక్షంగా ఈ విషయంపై భూమిక హింట్ ఇచ్చేసిందని తెలుస్తుండగా.. భూమిక ఇంతకీ ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది సస్పెన్స్ నెలకొంది. భూమిక చివరగా అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ పోషించిన Butterfly సినిమాలో నటించింది.
గుణశేఖర్ ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సరికొత్త కథాంశంతో యూత్ ఫుల్ సోషల్ డ్రామాగా సమకాలీన సామాజిక సమస్యల నేపథ్యంలో యుఫోరియా తెరకెక్కిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.
Read Also :
Committee Kurrollu | సెలబ్రేషన్స్ టైం.. కమిటీ కుర్రోళ్లు ఖాతాలో అరుదైన పురస్కారం
Siddu Jonnalagadda | జాక్ షూట్ గురించి చెప్పిన సిద్ధు జొన్నలగడ్డ
They Call Him OG | ఓజీ అప్డేట్స్ త్వరలో.. పవన్ కల్యాణ్ అభిమానులను ఎస్ థమన్ గుడ్‌న్యూస్
Khel Khel Mein | ఓటీటీలోకి అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?