Khel Khel Mein | బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం ‘ఖేల్ ఖేల్ మే’(Khel Khel Mein). వాణి కపూర్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించగా.. ఇండిపెండెన్స్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్ అందుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది.
ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 09 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక పార్టీలో ఒక గేమ్ ఆడాలి అనుకుంటారు. ఆ గేమ్ ఏంటి అంటే ఫోన్స్ అన్ లాక్ చేసి అందులో ఏం సీక్రెట్స్ ఉన్నాయి అనేది చూపించాలి. అయితే ఆ గేమ్ వలన వారి జీవితాలు ఏం అయ్యాయి అనేది ఈ సినిమా స్టోరీ. 2016లో వచ్చిన ఇటాలియన్ కామెడీ థ్రిల్లర్ ‘పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ కి రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది.
#KhelKhelMein (Hindi) Streaming from October 9th on Netflix #OTT_Trackers pic.twitter.com/3uPdl5ml3t
— OTT Trackers (@OTT_Trackers) October 5, 2024