అగ్రహీరో బాలకృష్ణ కథానాయకుడిగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కేవలం రాత్రుళ్లు మాత్రమే ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో దసరాకి విడుదల చేయాలనే కసితో చిత్రబృందం పనిచేస్తున్నది. వెంకటసతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. ఈ సినిమాతోపాటే సమాంతరంగా మరో సినిమా చేయాలనే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారు. త్వరలోనే ఆ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టి, సంక్రాంతికి విడుదల చేయాలనేది బాలకృష్ణ ఉద్ధేశ్యం.
అయితే.. దీనికి దర్శకులైతే సిద్ధంగా ఉన్నారు కానీ, కథ మాత్రం సిద్ధంగా లేదు. బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు లార్జర్ దేన్ లైఫ్ తరహా కథను వండే పనిలో దర్శకులున్నారు. ఈ మధ్య అగ్ర నిర్మాతలు దిల్‌రాజు, సూర్యదేవర నాగవంశీ, మైత్రీ అధినేతలు నవీన్, రవిశంకర్‌లు బాలకృష్ణకు కొందరు దర్శకులతో కథలు చెప్పించారట. వివేక్ ఆత్రేయ, హరీష్‌శంకర్, ‘దండుపాళ్యం’ ఫేం శ్రీనివాసరాజు, ‘మార్కో’ఫేం హనీఫ్ తదితరులు బాలకృష్ణకు కథలు వినిపించినవారిలో ఉన్నారు. వీరుగాక మరికొందరు దర్శకులు త్వరలో బాలకృష్ణకు కథలు వినిపించనున్నారు. వీరిలో ఎవరి కథకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారి సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అదే సంక్రాంతి బరిలో ఉంటుంది.