నాని నటించిన పీరియాడిక్ పానిండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ ఆగస్ట్ 21న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ఆయన సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తారు. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ క్రేజీ లైనప్‌ని ఇలాగే కొనసాగిస్తూ తన తర్వాతి సినిమాను కూడా నాని లైన్లో పెట్టేసినట్టు ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తున్నది.
దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన కథకు నాని పచ్చజెండా ఊపేశారట. సుజిత్ సినిమా తర్వాత నాని చేసేది ఈ సినిమానేనని సమాచారం. వెంకీ అట్లూరితో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తారని వినికిడి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.