Siddu Jonnalagadda | డీజే టిల్లు (DJ Tillu) ఫేం సిద్ధు జొన్నలగడ్డ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌తో SVCC 37 ప్రాజెక్టులో నటిస్తున్నాడు. చిత్రీకరణ ఇటీవలే షురూ అయింది. కొన్ని రోజులుగా జాక్ (Jack) సినిమా షూటింగ్ నేపాల్‌లో జరుగుతుండగా.. దీనికి సంబంధించిన స్టిల్స్ కూడా నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. తాజాగా షూట్ అప్డేట్ను షేర్ చేశాడు సిద్దు.
ఈ మూవీ నేపాల్ షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నటీనటులు సెట్స్‌లో యాక్షన్ మూడ్‌లో ఉన్న వీడియోను కూడా షేర్ చేశాడు. జాక్ టైటిల్‌ను ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో సిద్ధు గన్స్ పట్టుకుని ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.
నేపాల్ షెడ్యూల్లో హీరోయిన్ వైష్ణవి చైతన్య, ప్రకాశ్‌రాజ్ అండ్ టీం పాల్గొన్నది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి Achu Rajamani మ్యూజిక్ అందిస్తున్నారు. సిద్దు జొన్నల గడ్డ మరోవైపు నీరజ కోన డైరెక్షన్లో తెలుసు కదా సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ కూడా చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు టిల్లు 3 కూడా లైన్లో పెట్టాడు.
#JACK Wraps up the Nepal schedule on a tremendous high 😍
Big screens are in for endless entertainment 💯 #SidduJonnalagadda@iamvaishnavi04@baskifilmz @SVCCofficial #SVCC37 #JackTheMovie pic.twitter.com/toP6ofps3e
— SVCC (@SVCCofficial) October 5, 2024
Read Also :
Khel Khel Mein | ఓటీటీలోకి అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Srinu Vaitla | ట్రెండ్‌కు తగినట్టుగా తీశా.. ఆ పాత్రను రీప్లేస్ చేయడం చాలా కష్టం: శ్రీనువైట్ల
Vijay Sethupathi | పాపులర్ లీడర్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి.. వివరాలివే