Vijay Sethupathi | కోలీవుడ్ నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్న అతికొద్ది మంది నటుల్లో టాప్‌లో ఉంటాడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన ఈ స్టార్ యాక్టర్ ఓ బయోపిక్ చేయబోతున్నాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఇంతకీ ఎవరి బయోపిక్ అనేదే కదా మీ డౌటు. కర్ణాటక సీఎం, ప్రముఖ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah ). ఇందులో లీడ్ రోల్లో విజయ్ సేతుపతి పేరు దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. (Leader Ramaiah) టైటిల్‌తో ఈ చిత్రం రానుంది. బయోపిక్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నామని సత్య రత్నం తెలిపారు. అంతేకాదు బయోపిక్‌ను రెండు పార్టులుగా తీసుకురాబోతున్నట్టు వెల్లడించాడు.
ఈ ప్రాజెక్టులో ప్రముఖ కన్నడ నటుడు నిరూప్ భండారి కీలక పాత్రలో నటించనున్నట్టు ఇన్సైడ్ టాక్. ప్రజల చేత ఎదిగిన కింగ్ ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని నిర్మించబోయేదెవరనేది తెలియాల్సి ఉంది.
సిద్దరామయ్య జనతా దళ్, జనతా దళ్ (సెక్యులర్) నుంచి రెండు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అనంతరం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున రెండోసారి సీఎంగా కొనసాగుతున్నారు. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై క్లారిటీ రానుంది. గతంలోనే ప్రకటించిన ఈ సినిమా ఆలస్యమవుతూ..ఫైనల్‌గా సెట్స్‌పైకి వెళ్లనుండటంతో సినీ, రాజకీయ వర్గాల్లో సినిమాపై ఉత్కంఠ నెలకొంది.
Update #LeaderRamaiah: Biopic on #Siddaramaiah has hit the pause button for now! 🎬 Director #SathyaRatnam reveals it’s going to be a two-part saga. The biopic was set to be a grand two-part film, with plans to bring #VijaySethupathi on board! 🎬 that also * @nirupbhandari pic.twitter.com/WSvke2Stg7
— A Sharadhaa (@sharadasrinidhi) October 3, 2024
Kick 2 | గెట్ రెడీ డబుల్ కిక్ ఇస్తానంటున్న సల్మాన్ ఖాన్.. కిక్ 2 వచ్చేస్తుంది
Swag Twitter Review | వన్ మ్యాన్ షోలా శ్రీవిష్ణు స్వాగ్.. ఇంతకీ నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
Indian 3 | ఆ వార్తలే నిజమయ్యాయి.. డైరెక్టుగా ఓటీటీలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3