They Call Him OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులను ఊపిరాడకుండా చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఓజీ (OG). సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ఓజీ HUNGRYCHEETAH గ్లింప్స్ వైరల్ అవుతూ సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. ఓజీ కొత్త అప్డేట్ గురించి ఎదురుచూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం ఆసక్తికర హింట్ ఇచ్చేశాడు ఎస్ థమన్.
అందరూ OG అప్డేట్స్ గురించి అడుగుతున్నారు. త్వరలో అన్నీ తెలియజేస్తాం. మేము పనుల్లో ఉన్నాం.. ఖచ్చితంగా షాట్ పడుతుంది. మా నుండి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ వస్తుంది. సుజీత్ పొగ రాజేయగా.. రవి కె చంద్రన్ దానిని ఎలివేట్ చేశాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్కు ఇది బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది.. అంటూ చెప్పుకొచ్చాడు. ఎస్ థమన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. శ్రియారెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి థమన్ అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నట్టు గ్లింప్ క్లారిటీ ఇచ్చేస్తుంది.
ఓజీలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ కమ్ సింగర్ శింబు ఓ పాట పాడాడని తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తో శింబు ఉన్న స్టిల్ ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
Read Also :
Khel Khel Mein | ఓటీటీలోకి అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Srinu Vaitla | ట్రెండ్‌కు తగినట్టుగా తీశా.. ఆ పాత్రను రీప్లేస్ చేయడం చాలా కష్టం: శ్రీనువైట్ల
Vijay Sethupathi | పాపులర్ లీడర్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి.. వివరాలివే