హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వాతావరణం భిన్నంగా ఉన్నది. బుధవారం హైదరాబాద్‌సహా పలు జిల్లాల్లో ఉదయం వరకు భాను డు ప్రతాపం చూపగా, మధ్యాహ్నం తర్వాత చిరుజల్లులు కురిశాయి.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నందున హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే రెండ్రోజుల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని 27నాటికి రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.