చిక్కడపల్లి, ఫిబ్రవరి 25 : కుమ్మె ర ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పం దించాలని, లేకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. ఘటనకు వ్యతిరేకంగా బుధవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
కుల దురహంకారులపై కేసులు నమోదు చేయాలని పెద్దఎత్తున నినదించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, టీ సాగర్, నాయకులు ఎండీ అబ్బాస్, బండారు రవికుమార్, వెంకటేశ్, బాబురావు, స్కైలాబ్‌బాబు పాల్గొన్నారు.