SSMB 29 | తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29). టాలీవుడ్ సూపర్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)-మహేశ్ బాబు (Maheshbabu) కాంబోలో గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా తెరకెక్కనున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
మహేశ్ బాబు ఈ సినిమా కోసం కంప్లీట్ కొత్త అవతారంలో కనిపించబోతున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే లాంగ్ హెయిర్, పోనీ టెయిల్‌తో కనిపించిన ఈ స్టార్ యాక్టర్ మరో లుక్‌లో కనిపించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేశ్ బాబు మరోసారి మేకోవర్ మార్చేసుకుని.. కొత్త కొత్త గెటప్స్‌లో కనిపిస్తూ నెట్టింట సందడి చేస్తున్నాడు.
తాజాగా మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్తున్న సమయంలో ఎయిర్‌పోర్టులో లాంగ్ హెయిర్, గడ్డం, రెడ్ క్యాప్, హుడీ వేసుకుని స్టైలిష్‌గా నడిచి వస్తుండగా.. అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్‌మనిపించాయి. తాజాగా ఫొటోలు జక్కన్న సినిమాపై క్యూరియాసిటీ మరింత పెంచేస్తు్న్నాయి. ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
కాగా ఈ చిత్రంలో మహేశ్ బాబు పాత్ర డైలాగ్ డెలివరీ మాండలికం, పదాల ఉచ్చరణ వంటి అంశాలను పాపులర్ యాక్టర్ నాజర్ దగ్గరుండి చూసుకోనున్నారంటూ ఇప్పటికే ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని జక్కన్న టీం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఎయిర్‌పోర్టులో మహేశ్ బాబు..
Superstar #MaheshBabu‘s stylish airport look.
||#SSMB29|| pic.twitter.com/47XXKkQfU7
— Manobala Vijayabalan (@ManobalaV) October 7, 2024
Read Also :
Committee Kurrollu | సెలబ్రేషన్స్ టైం.. కమిటీ కుర్రోళ్లు ఖాతాలో అరుదైన పురస్కారం
Siddu Jonnalagadda | జాక్ షూట్ గురించి చెప్పిన సిద్ధు జొన్నలగడ్డ
They Call Him OG | ఓజీ అప్డేట్స్ త్వరలో.. పవన్ కల్యాణ్ అభిమానులను ఎస్ థమన్ గుడ్‌న్యూస్
Khel Khel Mein | ఓటీటీలోకి అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?