Good Bad Ugly | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith kumar) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ యాక్టర్ ఖాతాలో మగిజ్ తిరుమేని డైరెక్షన్లో నటిస్తోన్న విదాముయార్చితోపాటు అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) కూడా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
కాగా యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న గుడ్ బ్యాడ్ అగ్లీలో టాలీవుడ్ యాక్టర్ సునీల్ (Sunil) కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. తాజాగా అజిత్ కుమార్, సునీల్ దిగిన సెల్ఫీ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఇద్దరు షూటింగ్ స్పాట్లో సెల్ఫీ దిగారని తెలుస్తుండగా.. ఇంతకీ ఎక్కడనేది తెలియాల్సి ఉంది.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే అజిత్ కుమార్ ఖైదీ గెటప్‌లో స్టైలిష్‌గా చీర్ అప్ మూడ్‌లో బ్యాక్‌డ్రాప్‌లో గన్స్ రౌండప్ చేసిన లుక్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
వీరమ్ తర్వాత అజిత్‌కుమార్-డీఎస్పీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్‌తో అజిత్ కుమార్ యాక్షన్ ప్యాక్డ్ రోల్లో కనిపించబోతున్నాడని హింట్ ఇచ్చేసింది.
Exclusive: Unseen SELFIE Picture of Actor Sunil & #Ajithkumar Sir✌️💥
AK – Looking Awesome In a green Outfit 🥵
Note: Actor SUNIL is Playing an Important Role in #GoodBadUgly pic.twitter.com/X6hYcONgrY
— Kannan Pandian (@Kannan_1363) October 7, 2024
Read Also :
SSMB 29 | మహేశ్ బాబు నయా స్టిల్స్‌తో ఎస్ఎస్ఎంబీ 29 సినిమాపై సూపర్ హైప్
Euphoria | 2 దశాబ్ధాలు.. మళ్లీ తెరపైకి గుణశేఖర్ ఒక్కడు కాంబినేషన్..!
Committee Kurrollu | సెలబ్రేషన్స్ టైం.. కమిటీ కుర్రోళ్లు ఖాతాలో అరుదైన పురస్కారం
Siddu Jonnalagadda | జాక్ షూట్ గురించి చెప్పిన సిద్ధు జొన్నలగడ్డ