Ravi Teja | ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న లీడింగ్ యాక్టర్లలో ఒకరు రవితేజ (Ravi Teja). ఈ స్టార్ యాక్టర్ క్రాక్ తర్వాత గ్రాండ్ హిట్ కొట్టి మార్కెట్‌ను అమాంతం పెంచేసుకున్నాడు. ఆ తర్వాత 2022లో వచ్చిన ధమాకా సినిమాతో మరో బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన వాల్తేరు వీరయ్యలో కీలక పాత్రలో మెరిశాడు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ క్రెడిట్ మాత్రం చిరు ఖాతాలోకి వెళ్లిపోయింది.
ధమాకా తర్వాత రవితేజకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పలుకరిస్తున్నాయని తెలిసిందే. ఇక భారీ అంచనాల మధ్య ఇటీవలే విడుదలైన మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక నెక్ట్స్ ఫిలిం ఆర్టీ 75 షూట్లో గాయం కాగా.. సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకున్నాడు రవితేజ. ఇదిలా ఉంటే రెస్ట్ టైంలో కొత్త సినిమాల కోసం కథలు వినే పని పెట్టుకున్నాడట.
తాజా టాక్ ప్రకారం పాపులర్ కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సీ (Sundar C) కథ చెప్పగా రవితేజకు నచ్చిందట. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయానికి కూడా వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రజినీకాంత్‌తో అరుణాచలం లాంటి ఇండస్ట్రీ ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన సుందర్ సీ ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే కొంతకాలంగా ఈయన కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమాలు ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంటున్నాయి.
అసలే వరుస ఫెయిల్యూర్స్‌తో ఉన్న రవితేజ ఇలాంటి టైంలో సుందర్ సీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రిస్క్ చేస్తాడా..? ఏంటీ అని ఇండస్ట్రీ సర్కిల్లో ఓ వార్త రౌండప్ చేస్తోంది. మరి దీనిపై త్వరలో ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలంటున్నారు సినీ జనాలు. రవితేజ త్వరలోనే ఆర్టీ 75 షూట్లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం.
Read Also :
SSMB 29 | మహేశ్ బాబు నయా స్టిల్స్‌తో ఎస్ఎస్ఎంబీ 29 సినిమాపై సూపర్ హైప్
Euphoria | 2 దశాబ్ధాలు.. మళ్లీ తెరపైకి గుణశేఖర్ ఒక్కడు కాంబినేషన్..!
Committee Kurrollu | సెలబ్రేషన్స్ టైం.. కమిటీ కుర్రోళ్లు ఖాతాలో అరుదైన పురస్కారం
Siddu Jonnalagadda | జాక్ షూట్ గురించి చెప్పిన సిద్ధు జొన్నలగడ్డ