Akkineni Nagarjuna | టాలీవుడ్ నటి సమంతపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. నాగచైతన్య, సామ్ విడాకులపై కొండా సురేఖ మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సమంత, అక్కినేని కుటుంబానికి పలువురు మద్దతుగా నిలిచారు.
మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున ఆమెపై క్రిమినల్ కేసుతో పాటు, పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరయేందుకు నాంపల్లి కోర్టుకు చేరుకున్నాడు నాగార్జున. నాగార్జునతోపాటు అమల, నాగచైతన్య కూడా కోర్టుకు వచ్చారు.
వీరితోపాటు సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లు కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు. విచారణలో భాగంగా కోర్టు నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేయనుంది. ఈ వ్యవహారంలో నాగార్జునతోపాటు మిగిలిన సాక్షుల స్టేట్మెంట్స్ కూడా రికార్డు చేయనున్నట్టు తెలుస్తోంది.
Read Also :
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!
Chiranjeevi | పాపులర్ టూరిజం స్పాట్లో ఖరీదైన ప్రాపర్టీ కొన్న చిరంజీవి..!
Ravi Teja | ఏంటీ ఇలాంటి టైంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?
NTRNeel | ఒకే పార్ట్‌లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరంటే.?