Khammam Police | ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన బాధితులకు స్థానిక బీఆర్ఎస్ నేతలు పువ్వాడ ఫౌండేషన్ ద్వారా బోజన సౌకర్యాలు అందిస్తున్నారని తెలిసిందే. నిలువ నీడ కోల్పోయిన బాధితులు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు మానవతా దృక్పథంతో పువ్వాడ ఫౌండేషన్ భోజనం సౌకర్యం కల్పించడం కాంగ్రెస్ సర్కార్కు, పోలీసులకు మింగుడు పడటం లేదు.
వెలుగుమట్ల బాధితులకు కనీసం భోజనం కూడా పెట్టనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటుండటం గమనార్హం. ఖమ్మంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వెలుగుమట్ల బాధితులకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న భోజనాల వాహనాన్ని అడ్డుకున్నారు. మరోవైపు తమకు ఆకలేస్తుందని భోజనాలను పంపాలని మహిళలు, బాధితులు పోలీసుల కాళ్లు పట్టుకొని వేడుకున్నారు. అయితే అవేం పట్టించుకోకుండా
రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా భోజనాలు అందిస్తామని , బయట వ్యక్తులు భోజనం పెడితే తినొద్దని పోలీసులు హుకుం జారీ చేశారు. మరి ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన తమకు ఇన్ని రోజులుగా భోజనాలను ఎందుకు అందించలేదని బాధితులు పోలీసులను నిలదీశారు. పోలీసుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరోవైపు బాధితుల ఆకలి చూసిన బీఆర్ఎస్ నేతలు వారికి రోడ్డు మీదే భోజనం వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు కనీసం భోజనం కూడా పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్న పోలీసులు
ఖమ్మంలో పోలీసుల అత్యుత్సాహం
వెలుగుమట్ల బాధితులకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న భోజనాల వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
తమకు ఆకలేస్తుందని భోజనాలను పంపాలని పోలీసుల కాళ్లు పట్టుకొని,… https://t.co/V7hqk7jyfS pic.twitter.com/4sOLa1341p
— Telugu Scribe (@TeluguScribe) March 10, 2026
Bhadradri Kothagudem : కత్తి పట్టిన కలెక్టర్
ఏరియా వర్క్ షాప్లో సిపిఆర్, అగ్నిమాపక యంత్రాల వినియోగంపై అవగాహన
‘గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలి’