న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి దమ్ముంటే అమెరికాపై 70శాతం సుంకాలు విధించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. భారత్‌పై అమెరికా పెద్ద మొత్తంలో టారిఫ్‌లు విధిస్తుంటే, దీనిని మోదీ సర్కార్ సరిగా ఎదుర్కోవటం లేదని కేజ్రీవాల్ విమర్శించారు.
భారత దిగుమతులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లను విధిస్తే, అమెరికాపై భారత్ 75 శాతం టారిఫ్‌లను విధించాలని, ఈ విషయంలో ప్రధాని మోదీ కాస్త దమ్ము, ధైర్యం ప్రదర్శించాలని కేజ్రీవాల్ సూచించారు.