కోల్‌కతా, సెప్టెంబర్ 7: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో వర్తక, వాణిజ్య సైన్‌బోర్డులు, హోర్డింగ్‌లపై బెంగాల్ భాషను తప్పనిసరి చేశారు. ఈ మేరకు కోల్‌తా మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేస్తూ.. దానికి సెప్టెంబర్ 30 డెడ్‌లైన్‌గా విధించింది. భాషా అధికారాన్ని ప్రోత్సహించడం, సమ్మిళతత్వాన్ని నిర్ధారించడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్టు కోల్‌కతా మేయర్ ఫిర్హద్ కాశీమ్ తెలిపారు. కాగా, గత ఏడాది డిసెంబర్ 30న కూడా కార్పొరేషన్ అధికారులు ఇలాంటి సర్క్యులర్‌ను జారీ చేశారు.