న్యూఢిల్లీ: మీ హెయిర్ ైస్టెల్ వాయు కాలుష్యానికి కారణమవుతుందన్న సంగతి తెలుసా! సాధారణ హెయిర్ కేర్ ఉత్పత్తులు, జుట్టును ఆరబెట్టే, చిక్కుముళ్లు విప్పే వివిధ సాధనాలు వాడుతూ రోజూ జరిపే ‘హెయిర్ స్టయిలింగ్’ నుంచి నానో పార్టికల్స్(అత్యంత సూక్ష్మ కణాలు) గాలిలోకి విడుదలవుతాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
10-20 నిమిషాలపాటు చేసే హెయిర్ స్టయిలింగ్.. రద్దీతో కూడిన ట్రాఫిక్ నుంచి వెలువడే వాయు కాలుష్యంతో సమానమని ‘పర్దూ వర్సిటీ’ (అమెరికా) పరిశోధకులు చెబుతున్నారు. సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయి ఆరోగ్య సమస్యలను పెంచుతాయని ‘ఎన్విరాన్మెంటల్ సైన్స్ టెక్నాలజీ’ జర్నల్ కథనం పేర్కొన్నది.