Edgbaston Test : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లను కాచుకున్న శుభ్‌మన్ గిల్(168 నాటౌట్), రవీంద్ర జడేజా(89) జట్టు స్కోర్ 400 దాటించారు. ఆరో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపిందీ ద్వయం. గిల్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేయగా.. జడేజా మాత్రం సెంచరీ చేజార్చుకున్నాడు. జోష్ టంగ్ ఓవర్లో ఎక్స్ ట్రా బౌన్స్ అయిన బంతికి జడ్డూ వెనుదిరిగాడు. లంచ్ టైమ్‌కు గిల్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా స్కోర్.. 419/6.
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న అండర్సన్- టెండూల్కర్ ట్రోఫీలో వెనకబడిన భారత జట్టు రెండో టెస్టులో జోరు చూపిస్తోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(168 నాటౌట్ 288 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్సర్) సాధికారిక ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలర్లను విసిగిస్తున్నాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(89)తో కలిసి గిల్ విలువైన భాగస్వాయం నెలకొల్పాడు. మొదటి రోజే ఆతిథ్య జట్టు పేసర్లను ఆడేసుకున్న ఈద్వయం రెండో రోజు తొలి సెషన్లోనూ జోరు చూపించింది. సింగిల్స్, డబుల్స్,, వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోర్ వేగం పెంచారిద్దరూ.
Lunch on Day 2 in Edgbaston 🍱
109 runs in the first session for #TeamIndia 🙌
Captain Shubman Gill unbeaten on 168* 👌👌
Scorecard ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND pic.twitter.com/GKubv4hIh9
— BCCI (@BCCI) July 3, 2025
జడ్డూ కెరియర్లో 32వ హాఫ్ సెంచరీ సాధించగా.. గిల్ సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక స్కోర్‌తో రికార్డు సృష్టించాడు. ఆరో వికెట్‌కు 200 ప్లస్ భాగస్వామ్యంతో భారత్ స్కోర్ నాలుగొందలు దాటించిందీ జోడీ. అయితే.. కాసేపట్లో లంచ్ అనగా సెంచరీ దిశగా వెళ్తున్న జడేజాను జోష్ టంగ్ వెనక్కి పంపాడు. ఎక్స్ ట్రా బౌన్స్ అయిన బంతి వికెట్ కీపర్ జేమీ స్మిత్ చేతుల్లో పడింది. దాంతో, 414 వద్ద భారత జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన వాషింగ్టన్ 11 బంతుల్లో ఒక్క పరుగే చేసినా.. వికెట్ కాపాడుకోవడంతో భోజన విరామానానికి టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ, రెండో సెషన్లో గిల్, సుందర్‌లు ఎంత సేపు నిలబడతారు అనేదానిపై భారత్ 450 ప్లస్ కొట్టడం ఆధారపడి ఉంది.