Nayanthara | ఈ మధ్య సెలబ్రిటీల విడాకుల వార్తలు టాలీవుడ్లో ఎంత చర్చనీయాంశంగా మారుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకుంటూ అభిమానులని ఆందోళనకి గురి చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట అనుకోని కారణాల వలన విడాకులు తీసుకొని అభిమానులని తీవ్ర నిరాశకి గురి చేశారు. ఆ తర్వాత ధనుష్, అమీర్ ఖాన్, ఏఆర్ రెహమాన్ వంటి ప్రముఖులు కూడా విడాకుల బాట పట్టారు. ఇక ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
చిత్రసీమలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన నయనతార, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తన అద్భుతమైన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళ సినిమాల్లో ఆమె క్రేజ్ వేరు. స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీ దక్కించుకున్న ఈ భామ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. ఇక విఘ్నేష్ శివన్ అనే దర్శకుడిని ప్రేమించి వివాహం చేసుకున్న నయనతార, సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది.
తాజాగా, నయనతార తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేసి, వైవాహిక జీవితం గురించి కొన్ని కామెంట్లు చేసింది. “తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు, మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీవల్ల అని ఆమె పేర్కొంది.ఈ పోస్ట్‌ను ఆమె కొద్దిసేపటికే ఆమె డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే అది స్క్రీన్షాట్ల రూపంలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ నయనతార, విఘ్నేశ్ శివన్‌ల వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయనే అనుమానాలను కలిగిస్తుంది. కొంపదీసి నయనతార కూడా త్వరలో తన వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Nayana