No Fuel | ఫ్యూయల్ బ్యాన్పై ఢిల్లీ సర్కార్ యూటర్న్
No Fuel | జీవితకాలం ముగిసిన (EOL) వాహనాలకు ఆయిల్ పంపుల వద్ద ఇంధనాన్ని (No Fuel) నిషేధిస్తూ ఢీల్లీ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, ఈ నిర్ణయంపై ఢిల్లీ ప్రభుత్వం అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది.
No Fuel | జీవితకాలం ముగిసిన (EOL) వాహనాలకు ఆయిల్ పంపుల వద్ద ఇంధనాన్ని (No Fuel) నిషేధిస్తూ ఢీల్లీ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, ఈ నిర్ణయంపై ఢిల్లీ ప్రభుత్వం అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. ఇంధనం బ్యాన్ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ఢిల్లీలో ఇంధనం బ్యాన్ సాధ్యం కావడం లేదని తెలిపింది. వాహన వయసు ప్రకారం స్క్రాప్ చేయలేమని పేర్కొంది. కాలుష్య కారక వాహనాలను మాత్రం సీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇంధనం బ్యాన్ విధిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఢిల్లీ సర్కార్ ఉపసంహరించుకుంది.
వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిపడాన్ని అనుమతించేది లేదని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి దానిని అమలు చేస్తున్నది. దీనికోసం దేశ రాజధానిలోని 500 పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరా సిస్టమ్‌లను ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (DTIDC) ఏర్పాటు చేసింది. అదేవిధంగా 100 ప్రత్యేక బృందాలను ఢిల్లీ రవాణా శాఖ నియమించింది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్‌లకు ఈ నిషేధాన్ని విస్తరించనున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి నేషనల్ క్యాపిటల్ రీజియన్(NCR)లోని మిగిలిన ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో జీవితకాలం ముగిసిన వాహనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. నివేదికల ప్రకారం, ఢిల్లీలో జీవితకాలం ముగిసిన బైకుల సంఖ్య 62 లక్షలు ఉండగా, నాలుగు చక్రాల వాహనాలు 41 లక్షలు ఉన్నాయి. ఎన్సీఆర్ను పరిగణనలోకి తీసుకుంటే.. హర్యానాలో సుమారు 27.5 లక్షల వాహనాలు, ఉత్తరప్రదేశ్‌లో 12.4 లక్షలు, రాజస్థాన్‌లో 6.1 లక్షల వాహనాలు జీవితకాలం ముగిసిపోయాయి. 2018లో, సుప్రీంకోర్టు ఢిల్లీలో 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలను, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలను నిషేధించింది.
Also Read..
Heart Attack | జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ.. గుండెపోటుతో వ్యక్తి మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

