Heart Attack | దేశంలో ఇటీవలే గుండెపోటు (Heart Attack) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా 37 ఏళ్ల వ్యక్తి జిమ్ (Gym)లో వర్కౌట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన హర్యాణాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఫరీదాబాద్ (Faridabad)కు చెందిన 37 ఏళ్ల పంకజ్ (Pankaj).. 170 కిలోల బరువు ఉంటాడు. బరువు తగ్గాలని ఇటీవలే ఫరీదాబాద్‌లోని సెక్టార్-8లో గల ఓ జిమ్‌లో చేరాడు. రోజూలాగే మంగళవారం ఉదయం కూడా తన స్నేహితులతో కలిసి జిమ్‌కు వెళ్లాడు. రోజూ వర్కౌట్స్‌కు ముందు బ్లాక్ కాఫీ తాగడం అతడికి అలవాటు. అలా మంగళవారం ఉదయం 10:20 గంటల సమయంలో బ్లాక్ కాఫీ తాగి వ్యాయామం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన అతని స్నేహితులు సీపీఆర్ చేయగా.. ఎలాంటి స్పందనా లేదు. దీంతో పంకజ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పంకజ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు ధ్రువీకరించారు.
Also Read..
Serum Institute | కొవిడ్ టీకాలు సురక్షితమైనవి : సీరమ్ ఇన్స్టిట్యూట్
Hospital Collapses | కూలిన ప్రభుత్వ ఆసుపత్రి భవనం.. ఇద్దరు మృతి