Hospital Collapses | కేరళ (Kerala) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొట్టాయం (Kottayam)లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఒక భాగం కుప్పకూలిపోయింది (Hospital Collapses). ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి (Govt Medical College Hospital)లోని ఒక భాగం గురువారం మధ్యాహ్నం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ముందు జాగ్రత్తగా దాదాపు వంద మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోనని అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఘటనాస్థలాన్ని సందర్శించారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
Also Read..
Delhi Murder: తిట్టినందుకు తల్లీకొడుకుల గొంతు కోసి చంపిన పనిమనిషి
Cafe Staff Assaulted | ఎక్స్ట్రా కాఫీ కప్పు ఇవ్వనందుకు కేఫ్ సిబ్బందిపై దాడి.. VIDEO
Dalai Lama | వారసుడిని నిర్ణయించే హక్కు పూర్తిగా దలైలామాకే ఉంది : భారత్