Uttarakhand | ఉత్తరాఖండ్ (Uttarakhand) జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు (Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి (Landslides). సోన్‌ప్రయాగ్ మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 40 మంది కేదార్నాథ్ యాత్రికులు (Pilgrims) చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం అక్కడికి చేరుకొని వారిని రక్షించింది.
బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. కేదార్నాథ్ యాత్ర మార్గంలో కీలకమైన సోన్‌ప్రయాగ్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డట్లు చెప్పారు. అదే సమయంలో కేదార్నాథ్ దామ్ నుంచి తిరిగి వస్తున్న దాదాపు 40 మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అక్కడ చిక్కుకుపోయిన యాత్రికులను రక్షించినట్లు వివరించారు.
బద్రినాథ్, యమునోత్రికి వెళ్లే రహదారులు తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సిలైబ్యాండ్ – ఓజ్రి మధ్య రహదారిలో కొంత భాగం కొట్టుకుపోయినట్లు చెప్పారు. దీంతో రవాణా పూర్తిగా నిలిచిపోయినట్లు చెప్పారు. అత్యవసర సేవలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. అగ్రఖాల్, చంబా, జఖింధర్, దుఘమందర్తో సహా వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Also Read..
Hospital Collapses | కూలిన ప్రభుత్వ ఆసుపత్రి భవనం.. ఇద్దరు మృతి
Cafe Staff Assaulted | ఎక్స్ట్రా కాఫీ కప్పు ఇవ్వనందుకు కేఫ్ సిబ్బందిపై దాడి.. VIDEO
Dalai Lama | వారసుడిని నిర్ణయించే హక్కు పూర్తిగా దలైలామాకే ఉంది : భారత్