Good news for pilgrims! : ‘చార్ ధామ్ యాత్ర’ ప్రత్యేక రైలు నడుపనున్న ఐఆర్సీటీసీ
‘చార్ ధామ్ యాత్ర’ ప్రత్యేక రైలు నడుపనున్న ఐఆర్సీటీసీ | దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి దిగివస్తున్నది. ఈ క్రమంలో చార్ ధామ్ (బద్రీనాథ్, పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకాధీష్) సహా పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ ప్రత్యేక రైలును నడిపేందుకు ఐఆర్సీటీసీ నిర్ణయించింది. రామాయణ

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి దిగివస్తున్నది. ఈ క్రమంలో చార్ ధామ్ (బద్రీనాథ్, పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకాధీష్) సహా పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ ప్రత్యేక రైలును నడిపేందుకు ఐఆర్సీటీసీ నిర్ణయించింది. రామాయణ సర్క్యూట్లో నడుస్తున్న ‘శ్రీ రామాయణ యాత్ర’ రైలు ప్రజాదరణ పొందింది. దీంతో ఐఆర్సీటీసీ ‘దేఖో అప్నా దేశ్’ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ ‘చార్ధామ్ యాత్ర’ను ప్రారంభించింది.
యాత్ర 16 రోజుల పాటు కొనసాగనుండగా.. ఢిల్లీలోని సఫ్ధర్‌జంగ్ రైల్వేస్టేషన్ నుంచి సెప్టెంబర్ 18న రైలు బయలుదేరనుంది. యాత్రలో బద్రీనాథ్‌తో పాటు ‘మన’ గ్రామం (చైనా సరిహద్దులో ఉంది), నర్సింగ్ ఆలయం (జోషిమత్) ఆలయం, పూరి గోల్డెన్ బీచ్, కోనార్క్ సూర్యదేవాలయం, చంద్రభాగ బీచ్, ధనుష్కోడితో సహా రామేశ్వరం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, శివరాజ్‌పూర్ బీచ్, బెట్ ద్వారకతో సహా రిషికేశ్, జగన్నాథ్ పూరి ఆలయాలను దర్శించుకోవచ్చు.
ఈ ట్రైన్ సుమారు 8,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్లో రెండు రెస్టారెంట్లు, ఒక ఆధునిక వంటగది, రైలు కోచ్‌లో షవర్ క్యూబికల్స్, సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్ ఫంక్షన్లు, ఫుట్ మసాజర్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ట్రైన్ మొత్తం ఎయిర్‌కండిషన్ కాగా.. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం రైలులో ప్రతి కోచ్‌కు సీసీటీవీ కెమెరాలను సైతం బిగించారు.
దేశీయ పర్యాటకాన్ని రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ ‘దేఖో అప్నా దేశ్’కు అనుగుణంగా ప్రత్యేక రైలును ఐఆర్సీటీసీ ప్రారంభిస్తోంది. ప్యాకేజీ ధరను రూ.78,585కు నిర్ణయించారు. రైలు ప్రయాణం, డీలక్స్ హోటళ్లలో వసతి, భోజనం, వాహన సదుపాయం, ఆలయాల్లో దర్శనం, ప్రయాణ బీమా తదితర వసతులను ఐఆర్సీటీసీ కల్పించనుంది. ఈ డీలక్స్ టూరిస్ట్ రైలులో కరోనా మహమ్మారి వేళ 120 మందికే అవకాశం కల్పిస్తోంది. ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ గ్లోవ్స్, శానిటైజర్ పర్యాటకులందరికీ ఐఆర్సీటీసీ కిట్లను సమకూర్చనుంది. అయితే, 18 సంవత్సరాలు దాటిన వారందరు కనీసం ఒక మోతాదు టీకా తీసుకొని ఉండాలి.
ఇవి కూడా చదవండి..
తెలంగాణలో మూడు రోజులు వానలు
కేంద్ర కేబినెట్లో కొత్తగా సహకార మంత్రిత్వశాఖ!
మరో మూడు జిల్లాల్లో డ్రోన్లపై నిషేధం
ఘోరం : లారీ బోల్తాపడి ముగ్గురి దుర్మరణం
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
కేంద్ర మాజీ మంత్రి భార్య హత్య
అసోం, మేఘాలయలో భారీ భూకంపం
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మరణాలు
హెచ్ఐవీ వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ షురూ
తెలంగాణలో కెనడా సంస్థ రూ.740కోట్ల భారీ పెట్టుబడి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

