– మిర్యాలగూడ వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్ నగదు చోరీలో నిందితుల పట్టివేత
– కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్
మిర్యాలగూడ, సెప్టెంబర్ 23 : మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్లో భారీ నగదు చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు దొంగల నుండి రూ.66.50 లక్షలు, ఒక బైక్, స్క్రూ డ్రైవరు, సుత్తి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కేసు వివరాలు వెల్లడించారు. 05/06.09.2025 నాడు రాత్రి మిర్యాలగూడ I టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్లో భారీ దొంగతనం జరిగింది. దొంగలు రూ.80 లక్షలు చోరీ చేసి ఉడాయించారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎస్పీ ఆదేశాలతో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, మిర్యాలగూడ I టౌన్ ఇన్స్పెక్టర్ ఎం.నాగభూషణ రావు, హాలియా సీఐ సి.సతీష్ రెడ్డి, ఎస్ఐ డి.విజయ్ కుమార్, మిర్యాలగూడ I టౌన్ సిబ్బంది, సీసీఎస్ సిబ్బందితో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ ప్రత్యేక బృందాలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టౌన్, సూర్యాపేట జిల్లా, జగ్గయ్యపేట, ఖమ్మం జిల్లాల్లో సీసీ కెమెరాలు పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి, అత్యాధునిక సాకేంతిక పరిజ్ఞానం, సునిశిత పరిశోధన చేసి నేరానికి పాల్పడిన దొంగల ముఠాను రాజస్థాన్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు సంబందించిన అత్యంత సమస్యాత్మక ప్రదేశానికి సంబంధించిన వారిగా గుర్తించడం జరిగింది. తదుపరి ఈ ప్రత్యేక పోలీసు బృందాలు దొంగల ముఠాపై నిఘా ఏర్పాటు చేశారు. ముఠా సబ్యులు దొంగతనం చేసిన డబ్బును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్యపేటలో ఉంచారని, ఆ సొమ్మును తీసుకోవడానికి జగయ్యపేటకు వస్తున్నారని నమ్మదగిన సమాచారంతో వలపన్ని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్లో దొంగతనానికి పాల్పడింది తామేనని ఒప్పుకోగా వారిని అరెస్టు చేసి చోరి సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగింది.
1. మహమ్మద్ రహీం ఖాన్. తండ్రి జమాల్ ఖాన్, వయస్సు 45 సం. వృత్తి : టీ స్టాల్ వ్యాపారం, గ్రామం : కోర్కా గ్రామం, రానివాడ మండలం, జాలురు జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం.
2. ఇక్బాల్ ఖాన్. తండ్రి మహమ్మద్ ఖాన్, వయస్సు 35 సం. వృత్తి : సౌత్ ఇండియన్ టిఫిన్ సెంటర్ వ్యాపారం, గ్రామం : పోవ్రావు గ్రామం, సాయిలా మండలం, జాలురు జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం.
3. లాలూ ఖాన్. తండ్రి యూసుఫ్ ఖాన్. వయస్సు 33 సం. వృత్తి : టీ స్టాల్ వ్యాపారం, గ్రామం : పోవ్రావు గ్రామం, సాయిలా మండలం, జాలురు జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం.
ప్రధాన నిందితుడు మహమ్మద్ రహీం ఖాన్ గతంలో కొంతకాలం మిర్యాలగూడ పట్టణంలోని వివిధ ప్రాంతాలతో పాటు వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్ ముందు టీ స్టాల్ లో టీ మాస్టర్ గా పనిచేశాడు. ఆ సమయంలో వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్ కు సంబందించిన లావాదేవిల వివరాలు, డబ్బులను ఉంచే చోటు తదితర వివరాలను తెలుసుకుని పెద్ద మోతంలో డబ్బు దొంగాలించాలని దురుద్దేశంతో పథకం రచించి రాజస్తాన్ కు చెందినా తన మిత్రులు, పాత నేరస్తులు ఇక్బాల్ ఖాన్, లాలూ ఖాన్‌తో సమాలోచనలు చేసి ప్రస్తుతం తనుండే దుర్గాపురం కాలనీ, జగ్గయ్యపేటకు పిలిపించుకోవడం జరిగింది.
ఈ ముగ్గురు కలిసి ఒక హోండా బైక్ పైన మిర్యాలగూడకు తేది 05.09.2025 సాయంత్రం చేరుకున్నారు. రెక్కి నిర్వహించి రాత్రి 1 గంట సమయంలో ప్రజా సంచారం లేని సమయంలో ఇక్బాల్ ఖాన్ ను చోరీ చేసేందుకు హోటల్ లోనికి పంపించి, మిగితా ఇద్దరు హోటల్ బయట కాపలాగా ఉన్నారు. నగదు చోరీ చేసిన అనంతరం ముగ్గురు కలిసి బైక్ పై జగ్గయ్యపేటకు వెళ్లిపోయారు. అవసరాల నిమిత్తం కొంత డబ్బును ముగ్గురు పంచుకుని వారివారి స్వగ్రామాలకు వెళ్లారు. వెంట తీసుకువెళ్లిన డబ్బు ఖర్చు కావడంతో జగ్గయ్య పేట రూమ్ లో దాచిన మిగితా డబ్బును పంచుకోవడం కోసం రాగా నమ్మదగిన సమాచారం మేరకు రైడ్ చేసి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
కేసును చేధించడంలో ప్రతిభ కనపరిచిన రాజశేఖర రాజు, ఎస్డీపీఓ, మిర్యాలగూడ, ఎం.జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ సిసిఎస్, నల్లగొండ, ఎం.నాగభూషణ రావు, ఇన్స్పెక్టర్ మిర్యాలగూడ I టౌన్, సతీశ్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ హాలియా సర్కిల్. సోమ నర్సయ్య, ఇన్స్పెక్టర్ మిర్యాలగూడ II టౌన్, విజయ్ కుమార్, సబ్- ఇన్స్పెక్టర్ సిసిఎస్, రంజిత్ రెడ్డి. ఇన్స్పెక్టర్ జి.విష్ణు వర్ధన గిరి, హెడ్ కానిస్టేబుల్, రామ్ ప్రసాద్, వహీద్ పాషా, వెంకట్, సాయి, విజయ్, ఫయాజ్, పుష్పగిరి, మహేష్, జునైద్, దస్తగిరి, సిసిఎస్ కానిస్టేబుళ్లు నల్లగంతుల శ్రీను, గద్దల హుస్సేన్, కానిస్టేబుల్స్, మిర్యాలగూడ I టౌన్ PS లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంస పత్రాలు, రివార్డ్ ప్రకటించారు.