దామరచర్ల, సెప్టెంబర్ 23 : దామరచర్ల మండలం కొండ్రపోలు గ్రామంలో అదేవిధంగా అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెంలో నాణ్యత గల విత్తనాల పంపిణీలో భాగంగా శాస్త్రవేత్తల బృందం మంగళవారం వరి పంట పొలాలను పరిశీలించింది. ఇందులో భాగంగా కేఎన్ఎమ్ 1638 వరి రకం సాగులో మెలకువలు, ఆకుచుట్టు పురుగు, పాము పొడ, సుడిదోమ తెగుళ్ల నివారణ చర్యలు గురించి రైతులకు తెలిపారు. ఈ నాణ్యత గల విత్తనాలు రైతులు సాగు చేసుకుని తదుపరి గ్రామ రైతులందరికీ వచ్చే సీజన్ విత్తనాలుగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డా.టి కిరణ్ బాబు, డా.అరుణశ్రీ రైతులకు విత్తనాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రుషేంద్రమణి, సరిత, ఏఈఓలు ఆర్.పార్వతి, ఏ.సైదులు, నరేశ్, రైతులు కొడాలి ప్రభాకర్ రావు, పులి సైదులు, వి.భీమా నాయక్ పాల్గొన్నారు.