Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా నటుడు షారుఖ్ ఖాన్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. 71 వ జాతీయ చలనచిత్ర అవార్డుల (71st National Film Awards) ప్రదానోత్సవం నేడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గ్రాండ్గా జరుగుతుండగా.. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై విజేతలకు అవార్డులు అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే షారుఖ్కి జ్యూరీ ఉత్తమ నటుడిగా అవార్డును ప్రకటించగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు షారుఖ్. జవాన్ సినిమాకు గాను ఈ అవార్డు అందుకున్నాడు షారుఖ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
#WATCH | Delhi: President Droupadi Murmu confers Superstar Shah Rukh Khan with the National Film Award for the Best Actor in a Leading Role for his film ‘Jawan’.
(Source: DD News) pic.twitter.com/e3H4Kv4epy
— ANI (@ANI) September 23, 2025