పెద్దవూర, సెప్టెంబర్ 23 : యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డ రైతుపై ఓ హోంగార్డు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. యూరియా కోసం రైతులంతా క్యూ లైన్లో బారులు తీరారు. ఆ సమయంలో హోంగార్డు ఉషా నాయక్ ఓవరాక్షన్ చేస్తూ క్యూ లైన్లో ఉన్న రైతుపై చేయి చేసుకున్నాడు. రైతులకు అండగా ఉండాల్సిన పోలీసులు ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి హోంగార్డుపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.