Buttermilk With Ginger Juice | మజ్జిగను చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. మజ్జిగను అన్నంలో కలిపి తింటారు. లేదా నేరుగా తాగుతారు. మజ్జిగ ప్రో బయోటిక్ ఆహారాల జాబితాకు చెందుతుంది. అందువల్ల మజ్జిగను సేవిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. భారతీయులు మజ్జిగను ఎంతో కాలం నుంచి తమ రోజువారి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు గాను చాలా మంది మజ్జిగను సేవిస్తుంటారు. దీని వల్ల వేసవి తాపం తగ్గుతుంది. శరీరంలోని వేడి తొలగిపోతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అయితే మజ్జిగలో అల్లం రసం కలిపి తాగితే అనేక లాభాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మజ్జిగలో అల్లం రసం కలిపి సేవించడం వల్ల పలు వ్యాధులు నయం అవుతాయని వారు అంటున్నారు. మజ్జిగలో అల్లం రసం కలిపి తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మజ్జిగ అద్భుతమైన ప్రో బయోటిక్ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఇది లాక్టో బేసిల్లస్ అనే మంచి బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మజ్జిగను తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అల్లం వల్ల జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తాయి. దీని వల్ల గ్యాస్ తొలగిపోతుంది. జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది. పొట్టలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. మజ్జిగకు శరీరాన్ని సహజసిద్ధంగా చల్ల బరిచే గుణాలు ఉంటాయి. కనుక శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. వేడి వాతావరణంలో ఉండేవారు మజ్జిగలో అల్లం రసం కలిపి సేవిస్తే ఫలితం ఉంటుంది. శరీరంలోని వేడి తొలగిపోతుంది. అలాగే జ్వరం వచ్చిన వారు తాగితే త్వరగా కోలుకుంటారు. శరీరం చల్లబడుతుంది. నీరసం, అలసట తగ్గుతాయి. ఉత్సాహంగా మారుతారు.
మజ్జిగను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. మజ్జిగలో ఉండే ప్రో బయోటిక్స్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి యాంటీ మైక్రోబియల్ సమ్మేళనాలుగా కూడా పనిచేస్తాయి. అందువల్ల మజ్జిగలో అల్లం రసం కలిపి సేవిస్తే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మజ్జిగలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ను సమతుల్యంలో ఉంచుతుంది. దీని వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి పొందుతుంది. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు.
మజ్జిగలో అల్లం రసం కలిపి సేవించడం వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. మజ్జిగలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి మజ్జిగ మేలు చేస్తుంది. మజ్జిగను సేవిస్తుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. మజ్జిగలో అల్లం రసం కలిపి సేవిస్తుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.ఇక మజ్జిగను మధ్యాహ్నం పూట సేవిస్తే మంచిది. దీనికి శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది కనుక రాత్రి పూట సేవిస్తే శరీరంలో కఫం చేరే అవకాశం ఉంటుంది. కనుక మజ్జిగను మధ్యాహ్నం సేవించాలి. ఇలా మజ్జిగలో అల్లం రసం కలిపి తాగితే అనేక లాభాలను పొందవచ్చు.