MLA Jagadish Reddy | హైదరాబాద్ : నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా నిరాహార దీక్ష చేపట్టిన అశోక్‌కు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్ధతు లభిస్తుంది. 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అశోక్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అశోక్ నిరాహార దీక్షకు సిటీ సెంట్రల్ లైబ్రరీ నిరుద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఉస్మానియా దవాఖాన ఆవరణలో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈక్రమంలో నిరుద్యోగులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ.. అశోక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని, 9రోజులుగా దీక్ష చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం అశోక్‌తో చర్చలు జరిపి, ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. అశోక్ ప్రాణాలకు హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.