చందంపేట, సెప్టెంబర్ 18 : ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. జనహిత కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని పోలియో నాయక్ తండాలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తండాలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. తండాలో విద్యుత్, నీటి సమస్య ఉన్నట్లు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
వారం రోజులు తండాలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట స్పెషల్ ఆఫీసర్ జోసఫ్, తాసీల్దార్ శ్రీధర్ బాబు, ఎంపీడీఓ లక్ష్మి, మాజీ ఎంపీపీలు గోవింద్ యాదవ్, బిక్కు నాయక్, మాజీ జడ్పీటీసీ లచ్చిరాం నాయక్, పంచాయతీ రాజ్ డీఈ.లింగారెడ్డి, కొర్ర రాంసింగ్ నాయక్, హరికృష్ణ, సాదిక్, బాధ్య నాయక్, మల్లారెడ్డి, మున్నయ్య యాదవ్, గిరి, ఏఈ రాజు, సతీశ్‌రెడ్డి, నారాయణ రెడ్డి, దామెర వెంకటయ్య ఉన్నారు.