మునుగోడు, సెప్టెంబర్ 18 : మునుగోడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని చండూరు ఆర్డీఓ శ్రీదేవి గురువారం సందర్శించారు. యూరియా నిల్వ, పంపిణీ వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా యూరియా అందించాలని సంఘం సిబ్బందికి సూచించారు. రైతులను యూరియా సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి రైతుకు సరిపడా యూరియాను ప్రభుత్వం అందిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఇన్చార్జి తాసీల్దార్ నరేశ్, ఏఓ పద్మజ, సంఘం సిబ్బంది పాల్గొన్నారు.