Sangareddy | మంజీరా నదిలో దూకి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య..?
Sangareddy | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చాల్కి గ్రామ శివారులో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భయం భయంగా ఉంది.. చనిపోతాను అంటూ కూతురితో వీడియో కాల్ మాట్లాడిన అతను.. మంజీరా నదిలో దూకేశాడు.
Sangareddy | జహీరాబాద్, ఫిబ్రవరి 21: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం చాల్కి గ్రామ శివారులో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భయం భయంగా ఉంది.. చనిపోతాను అంటూ కూతురితో వీడియో కాల్ మాట్లాడిన అతను.. మంజీరా నదిలో దూకేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఝరాసంగం మండలం కుప్పనగర్‌కు చెందిన పాపయ్య నారాయణఖేడ్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య కొంతకాలం క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. అప్పట్నుంచి ఇద్దరు కూతుళ్లతో కలిసి నారాయణఖేడ్‌లోనే నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం బైక్‌పై ఇంటి నుంచి వెళ్లిన పాపయ్య మంజీరా నది ఒడ్డునకు చేరుకుని తన కూతురికి వీడియో కాల్ చేశాడు. ‘భయం భయంగా ఉంది. చనిపోతాను.. మీరందరూ బాగుండాలి.’ అని కూతురితో చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో కంగారుపడిపోయిన కుమార్తె కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. అందరూ కలిసి మంజీరా నది ఒడ్డునకు వచ్చి పాపయ్య కోసం వెతికారు. ఈ క్రమంలో మంజీరా నది ఒడ్డున బైక్, సెల్‌ఫోన్, బట్టలు కనిపించాయి. దీనిపై పాపయ్య కుటుంబసభ్యులు హద్నూర్ పోలీసులకు సమాచారం అందించారు.
కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హద్నూర్ పోలీసులు పాపయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజఈతగాళ్లతో శుక్రవారం రాత్రి వరకు మంజీరా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అతని ఆచూకీ దొరకలేదు. చీకటి పడటంతో సహాయక చర్యలు ఆపేసిన పోలీసులు.. శనివారం తెల్లవారుజామునే గాలింపు చర్యలు చేపట్టారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

