Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఓ గంట పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది. భారీ వర్షానికి నగరంలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి. సోమాజిగూడలో మోకాళ్ల లోతు నీరు రోడ్డుపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, ఓయూ, తార్నాక, దోమలగూడ, విద్యానగర్, బాగ్‌లింగంపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, బర్కత్‌పురా, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మణికొండ, ఫిల్మ్‌నగర్, ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, ఎస్సార్ నగర్, అమీర్‌పేట్, బోరబండ, అల్లాపూర్, చార్మినార్, బహదూర్‌ఫురా, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, ఫలక్‌నూమా, బార్కస్, లంగర్‌హౌస్, కార్వాన్, మల్కాపూర్, అసిఫ్నగర్తో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది.