న్యూఢిల్లీ : దేశంలో విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోతున్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ రెండో అర్ధభాగంతో పోల్చితే మే మొదటి అర్ధభాగంలో దేశ విద్యుత్ వినియోగం 6.2శాతం పడిపోయింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు కరోనా లాక్‌డౌన్‌ను విధించగా.. దీంతో డిమాండ్ తగ్గింది. ఫెడరల్ గ్రిడ్ రెగ్యులేటర్, పోసోకో (పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్) గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ రెండో భాగంలో 3,910 బిలియన్ యూనిట్లతో పోల్చితే.. మే నెల మొదటి 16 రోజుల్లో రాష్ట్రాల్లో మొత్తం రోజువారీ సగటు విద్యుత్ సరఫరా 3,666 బిలియన్ యూనిట్లకు పడిపోయింది.
దేశంలో వార్షిక విద్యుత్ వినియోగం పరిశ్రమలు, కార్యాలయాల్లోనే సగానికిపైగా ఉంది. భారత్‌లో విద్యుత్ ఉత్పత్తి సాధారణంగా ఏప్రిల్ నుంచి పెరగడం ప్రారంభం అవుతుంది. వేసవి దృష్ట్యా ఎయిర్ కండిషన్ల వినియోగించే అవకాశం ఉండడంతో మేలో భారీ డిమాండ్ ఉంటుంది. రెండు దక్షిణాది రాష్ట్రాలు, రెండు ఈశాన్య రాష్ట్రాలు మినహా విద్యుత్ వినియోగం అంతకు ముందు సంవత్సరం కంటే ఎక్కువగా ఉందని పోసోకో డేటా చూపింది. గతేడాది ఏప్రిల్ మే నెలల్లో కేంద్రం జాతీయ లాక్డౌన్ విధించగా.. సెకండ్ వేవ్ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై కేంద్రం వెనక్కి తగ్గింది. అయినా, పలు రాష్ట్రాలు ఆంక్షల బాటపట్టాయి. అయితే, 2020 చివరిలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని సీనియర్ ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.
వైరస్ నియంత్రించడానికి తీసుకువచ్చిన ఆంక్షలతో ఏప్రిల్ రెండో అర్ధభాగంతో పోలిస్తే మూడు వంతుల ప్రాంతాలు విద్యుత్ వినియోగం తగ్గుదలను నమోదు చేశాయి. ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీలో విద్యుత్ వినియోగం పెరిగింది. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఏప్రిల్ రెండో అర్ధభాగంతో పోలిస్తే మొత్తం విద్యుత్ ఉత్పత్తి 6.3శాతం పడిపోయింది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌కు సరఫరా చేసిన విద్యుత్ భారత్‌లోని అత్యంత ధనిక, అత్యంత పారిశ్రామిక రాష్ట్రాలు. ఇవి మొత్తం వినియోగంలో దాదాపు మూడో వంతు వాటాను కలిగి ఉండగా.. ఒక్కొక్క రాష్ట్రంలో ఐదు శాతానికి పైగా పడిపోయింది.