విషాదం : హైదర్‌గూడలో అగ్ని ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
హైదర్‌గూడలో అగ్ని ప్రమాదం.. ఒకరు సజీవ దహనం | నగరంలోని హైదర్‌గూడ పరిధిలోని అవతినగర్లో సోమవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంటల ధాటికి ఒకరు సజీవ దహనమవగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి.

హైదరాబాద్ : నగరంలోని హైదర్‌గూడ పరిధిలోని అవతినగర్లో సోమవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంటల ధాటికి ఒకరు సజీవ దహనమవగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో మంటలు చెలరేగాయి. ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న సమయంలో తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకొని గౌరీనాథ్ (38) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయాలకు గురైన వారిని వెంటనే హైదర్‌గూడలోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆర్టీపీసీఆర్లో తేలకుంటే మరో టెస్టు
చేయని తప్పుకు శిక్ష.. 550 కోట్ల పరిహారం!
గుజరాత్లో భూకంపం
ఉస్మానాబాద్ జైలులో 133 మంది ఖైదీలకు కరోనా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

