జగన్నాథుడి దర్శనం.. జూన్ 15 వరకు బంద్
జగన్నాథుడి దర్శనం.. జూన్ 15 వరకు బంద్ | కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని పూరీలోని ప్రఖ్యాత జగన్నాథుడి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది.

భువనేశ్వర్ : కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని పూరీలోని ప్రఖ్యాత జగన్నాథుడి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. ఈ నెల 5న ఒడిశా ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఆలయం మూసివేశారు. శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషటర్ క్రిషన్‌కుమార్, కలెక్టర్ సమర్త్ వర్మ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని వచ్చే నెల 15వ తేదీ వరకు మూసే ఉంచాలని నిర్ణయించారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను సమీక్షించాలని నిర్ణయించారు.
అయితే, ఆలయంలో స్వామివారికి ఆనవాయితీగా వస్తున్న ఆచారాలు కొనసాగుతాయని, అర్చకులు, సేవకుల సహాయంతో సాగుతాయని క్రిషన్‌కుమార్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొవిడ్ ప్రోటోకాల్స్ మేరకు చందన్ యాత్ర శనివారం ప్రారంభమైంది. ఇందులో పాల్గొన్న వారందరికీ కొవిడ్ పరీక్షలు చేయించారు. రథాల నిర్మాణానికి సంబంధించిన పనులు పూర్తయ్యే వరకు వడ్రంగి, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఉంచనున్నట్లు ఓ అధికారి తెలిపారు. కరోనా మొదటి వేవ్‌లో పెద్ద ఎత్తున ఆలయ అర్చకులు, సేవకులు కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆదివారం ఒడిశాలో 11,732 పాజిటివ్ కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 6.12లక్షలు దాటింది.
ఇవి కూడా చదవండి..
ఆర్టీపీసీఆర్లో తేలకుంటే మరో టెస్టు
చేయని తప్పుకు శిక్ష.. 550 కోట్ల పరిహారం!
గుజరాత్లో భూకంపం
ఉస్మానాబాద్ జైలులో 133 మంది ఖైదీలకు కరోనా
విషాదం : హైదర్‌గూడలో అగ్ని ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

