FIH Pro League : ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత మహిళల హాకీ(Indian Women Hockey) జట్టు పరాజయల పరంపర కొనసాగుతోంది. శనివారం జర్మనీ(Germany)తో జరిగిన మ్యాచ్‌లో సలీమ తెతే(Salima Tete) నేతృత్వంలోని టీమిండియా మరో ఓటమి మూటగట్టుకుంది. లండన్‌లోని లీ వ్యాలీ హాకీ టెన్నిస్ స్టేడియంలో భారత జట్టు ప్రత్యర్థి జోరుకు తలవంచింది.
జర్మనీ డిఫెండర్లను బోల్తా కొట్టించి రెండు గోల్స్ కొట్టినా 2-4తో మ్యాచ్ చేజార్చుకుంది. దాంతో ఈ మెగాటోర్నీలో టీమిండియాకు వరుసగా ఏడో ఓటమి ఎదురైంది. ఈ లీగ్‌లో చెత్త ఆటతో నిరాశపరిచిన మహిళల జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. అమెరికా 8 పాయింట్లతో అట్టడుగున నిలిచింది.
Not the result we expected but the team will bounce back better.
Germany outscoring us in a 6-goal fest.FT:
Germany 🇩🇪 4 – 2 India 🇮🇳
Goalscorers:
23′ 32′ Huse Viktoria (PC)
51′ Kurz Stine (PC)
55′ Bleuel Jule9′ Sunelita Toppo
15′ Deepika#HockeyIndia #IndiaKaGame… pic.twitter.com/t3ndm2l8sG— Hockey India (@TheHockeyIndia) June 8, 2024
ఆరు ఓటముల తర్వాతి మ్యాచ్ కావడంతో ఎలాగైనా గెలవాలని భారత జట్టు దూకుడుగా ఆడింది. మ్యాచ్ ఆరంభంలోనే జర్మనీ గోల్ పోస్ట్‌పై దాడిచేసిన భారత అటాకర్లు సక్సెస్ అయ్యారు. లితా టొప్పొ(9వ నిమిషం), దీపికా కుమారి(15వ నిమిషం)లు చెరొక గోల్ బాదడంతో ప్రత్యర్థి ఒత్తిడికి లోనైంది. అయితే.. మ్యాచ్ ఆసాంతం భారత అమ్మాయిలు ఆదే జోరును కనబరచలేకపోయారు. జర్మనీ ప్లేయర్లు ఎదురుదాడికి దిగి నాలుగు గోల్స్ సాధించడంతో ఈ మెగా టోర్నీలో టీమిండియా ఓటమిల సంఖ్య ఏడుకు చేరింది.