T20 World Cup 2024 : ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ తొమ్మిదో సీజన్లో సంచనాల పర్వం నడుస్తోంది. పెద్ల జట్లకు పసికూనలను షాకిస్తూ రికార్డు విజయాలు నమోదు చేస్తున్నాయి. ఇప్పటివరకూ స్వల్ప స్కోర్లతో చప్పగా సాగుతున్న మెగా టోర్నీలో ఫుల్ జోష్ నింపడానికి భారత్(India), పాకిస్థాన్(Pakistan)లు సిద్దమయ్యాయి. ఆదివారం న్యూయార్క్ వేదికగా ఇరుజట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. అయితే.. ఈ పోరుకు వరుణుడు అంతరాయం కలిగించేలా ఉన్నాడు. ఈ విషయాన్ని శనివారం న్యూయార్క్ వాతావరణ శాఖ తెలిపింది.
ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. జూన్ 9 ఆదివారం కూడా చినుకులు పడే చాన్స్ ఉంది. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్న భారత, పాక్ మ్యాచ్‌కు సైతం వానగండం ఉందని సమాచారం. అయితే.. భారీ వర్షం కాకుండా తేలికపాటి జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 9న న్యూయార్క్‌లో వర్షం కురిసేందుకు 5 శాతం చాన్స్ ఉందని చెప్పింది. దాంతో, లక్షలు పెట్టి మ్యాచ్ టికెట్లు కొన్న వందలాది ఫ్యాన్స్ ‘హమ్మయ్యా’ అని ఊపిరిపీల్చుకుంటున్నారు.
Excitement, Anticipation, Energy and a lot of buzz ahead of a riveting contest 🤩
New York gets ready for an epic clash and #TeamIndia fans are pumped 🆙 for #INDvPAK 🙌 – By @RajalArora
WATCH 🎥 🔽 #T20WorldCup https://t.co/g8k1L5FC0m
— BCCI (@BCCI) June 8, 2024
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో దాయాది జట్లు 7 సార్లు తలపడగా.. టీమిండియా రికార్డు స్థాయిలో ఆరు విజయాలు సాధించింది. నిరుడు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లోనూ చిరకాల ప్రత్యర్థిని రోహిత్ శర్మ బృందం మట్టికరిపించింది. పైగా.. మెగా టోర్నీలో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్ ఆత్మవిశ్వాసంతో ఉండగా.. అమెరికా చేతిలో ఓటమిపాలైన పాక్ ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది.