Star Movie | ‘దాదా’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ నటుడు కవిన్ (Actor Kavin). ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం స్టార్ (Star Movie). ఈ సినిమాకు ప్యార్ ప్రేమ కాదల్ (Pyar Prema Kadhal) ఫేమ్ ఎలాన్ (Elan) దర్శకత్వం వహించగా యువన్ శంకర్ రాజా (Yuvan Shanker raaja) సంగీతం అందించాడు. ఈ చిత్రం మే 10న తమిళంలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతో తెలుగు భాషల్లో స్టార్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని తమిళ ప్రోడక్షన్స్ రైస్ ఈస్ట్ ఎంటర్టైనమెంట్స్ (Rise East Entertainments), టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్స్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) సంయుక్తంగా నిర్మించాయి.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పాండియన్ (లాల్)కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. అయితే ఇంట్లో సమస్యల వలన నటుడు కాలేక ఫొటోగ్రాఫర్‌గా మిగిలిపోతాడు. అయితే తన కొడుకు(కవిన్)ను మాత్రం యాక్టర్ చేయాలి అనుకుంటాడు. ఇక పాండియన్ ఎంకరేజ్‌తో చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చితో కలై పెరుగుతాడు. పెద్దగా అయిన అనంతరం ముంబైలో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేస్తాడు. ఈ క్రమంలోనే కలైకు ఒక సినిమాలో హీరోగా ఛాన్స్ వస్తుంది. అయితే అనుకోకుండా కవిన్ లైఫ్‌లో ఇక యాక్సిడెంట్ జరిగి అంత తలకిందులు అవుతుంది. ఈ క్రమంలోనే కలై మళ్లీ నటుడు అవ్వాలి అనుకున్నాడా. పాండియన్ కళ నేరవేరిందా. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
The journey of a man and his dream ❤️#STAR – streaming now on Amazon Prime.
Link – https://t.co/0YrLtXVhS8#STARMOVIE ⭐ #KAVIN #ELAN #YUVAN #KEY@Kavin_m_0431 @elann_t @thisisysr @aaditiofficial @PreityMukundan @LalDirector @riseeastcre @SVCCofficial @Pentelasagar @BvsnP pic.twitter.com/KelWAJjl9i
— SVCC (@SVCCofficial) June 7, 2024