Raja Saab | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం రాజాసాబ్ (Raja saab). పాన్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ సినిమా టాలీవుడ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ వస్తుండగా.. మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది మారుతి అండ్ ప్రభాస్ టీం. మారుతి సినిమా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రాజాసాబ్ హార్రర్ ఎలిమెంట్స్ తాజా ఫీల్ అందించేలా భిన్నంగా ఉండబోతున్నాయన్నాడు మారుతి. అంతేకాదు ఇందులో వచ్చే దెయ్యాలు, జంప్ స్క్వేర్స్ (సినిమా లేదా టీవీ షోలు, ఈవెంట్స్), హార్రర్ గ్యాగ్స్ (జోక్స్, ఫ్రాంక్) పూర్తిగా కొత్తగా ఉండబోతున్నాయి. ఇదివరకు వచ్చిన ఏ సినిమాల నుంచి స్పూర్తిగా తీసుకున్నవి కావు. ప్రేమ కథా చిత్రంలోని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు భయపడే సన్నివేశాలు పూర్తిగా ప్రస్తుతానికి కాలం చెల్లినవి. రాజాసాబ్‌లో అలాంటి సీన్లు రిపీట్ కావన్నాడు మారుతి. ఫాంటసీ ఎలిమెంట్స్‌కు హార్రర్ అంశాలను జోడిస్తూ యూనిక్‌గా సాగేలా రాజాసాబ్ ఉంటుందని.. సినిమా మొత్తం సర్ప్రైజింగ్గా అనిపించేలా ఉంటుందని చెప్పుకొచ్చాడు మారుతి.
అంతేకాదు మారుతి రీసెంట్గా ఓ చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. రాజాసాబ్ క్లైమాక్స్ 35-40 నిమిషాలుంటుందని చెప్పి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. పాట తర్వాత క్లైమాక్స్ మొదలువుతుంది. చాలా విషయాలు జరుగుతుంటాయి. సినిమా కథనంలోని కీలక విషయాలను చూపించే క్రమంలోయాక్షన్, డ్రామా సన్నివేశాలతో క్లైమాక్స్ ఉంటుంది. మొత్తం ఎపిసోడ్ చాలా నీట్‌గా ఉండటంతో ఎలాంటి సాగదీసిన ఫీలింగ్ అనిపించదు. ప్రేక్షకులు పరకాయ ప్రవేశం చేసేలా క్లైమాక్స్ ఉంటుంది.. అందరిని ఇంప్రెస్ చేయడం పక్కా అని చెప్పుకొచ్చాడు.
మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన రాజాసాబ్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్స్‌కు మంచి స్పందన వస్తోంది. రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌కు విజువల్ ట్రీట్ ఇస్తున్నాడు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రాజాసాబ్‌లో సంజయ్ దత్ సంజూబాబా పాత్రలో కనిపించబోతున్నాడు.