తుర్కయంజాల్, జనవరి 5 : ప్రపంచ స్థాయి వ్యవసాయ పండ్ల మార్కెట్, ప్రపంచ స్థాయి చేపల ఎగుమతుల మార్కెట్ ఏర్పాటుకు కోహెడలోని స్థలం సేకరించిన ప్రభుత్వం, కోహెడను డివిజన్‌గా గుర్తించకపోవడం దారుణం అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, కోహెడ మాజీ ఉప సర్పంచ్ బిందు రంగారెడ్డి అన్నారు. సోమవారం తొర్రూర్ డివిజన్ పరిధి కొహెడలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. వ్యవసాయ పండ్ల మార్కెట్ ఏర్పాటు కోరకు 170 ఎకరాలు, చేపల ఎగుమతులకు 13 ఎకరాల స్థలాన్ని కోహెడ రెవెన్యూ నుంచి తీసుకున్న ప్రభుత్వం శివారు మున్సిపాలిటిలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన సందర్భంలో కోహెడను డివిజన్‌గా ప్రకటించకపోవడం అన్యాయం అన్నారు.
రెవెన్యూలో అత్యంత పెద్ద ప్రాంతమైన కోహెడను డివిజన్‌గా ప్రకటించకుండా రాజకీయ స్వార్థం కోసమే తొర్రూర్ డివిజన్ ఏర్పాటు చేశారని విమర్శించారు. శివారు మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి ఆరు నెలల ముందు నుంచి ప్రక్రియ మొదలైన స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతోనే తుర్కయంజాల్ మున్సిపాలిటీని అస్తవ్యస్తంగా విభజించారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కోహెడను డివిజన్‌గా ప్రకటించాలని లేని పక్షంలో కొహెడ నుంచి పెద్ద ఉద్యమం మొదలౌతుందని అన్నారు.