TVS iQube | ఐ-క్యూబ్ స్కూటర్లు రీకాల్ చేసిన టీవీఎస్.. కారణమేమిటంటే..?!
TVS iQube | ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఐ-క్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ (iQube electric Scooter)ను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
TVS iQube | ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఐ-క్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ (iQube electric Scooter)ను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘ప్రోయాక్టివ్ ఇన్స్పెక్షన్ (Proactive Inspection)’ కోసం వాటిని రీకాల్ చేస్తున్నట్లు శనివారం తెలిపింది. 2023 జూలై 10 నుంచి 2023 సెప్టెంబర్ తొమ్మిదో తేదీ మధ్య తయారైన ఐ-క్యూబ్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నామని తెలిపింది. ఐ-క్యూబ్ స్కూటర్లలో ‘బ్రిడ్జి ట్యూబ్ఆఫ్ యూనిట్స్ (bridge tube of units)’ను తనిఖీ చేయడానికి కస్టమర్లను సంప్రదిస్తుందని తెలిపింది. వెహికల్ రైడ్ హ్యాండ్లింగ్ సజావుగా సాగేందుకు తనిఖీ చేస్తున్నామని, ఇందుకోసం కస్టమర్ల నుంచి ఎటువంటి చార్జీ వసూలు చేయబోమని తెలిపింది.
ఇటీవలే టీవీఎస్ మోటార్ కంపెనీ తన టీవీఎస్ ఐ-క్యూబ్ స్కూటర్లను మూడు వేరియంట్లలోకి విస్తరించింది. అందులో 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ గల ఐ-క్యూబ్ రూ.94,999 (ఎక్స్ షోరూమ్), ఐ-క్యూబ్ ఎస్టీ రెండు బ్యాటరీ ప్యాక్‌ల్లో ఆవిష్కరించింది. ఐ-క్యూబ్ ఎస్టీ 3.4 కిలోవాట్ల యూనిట్ రూ.1.55 లక్షలు (ఎక్స్ షోరూమ్), 5.1 కిలోవాట్ల యూనిట్ రూ.1.83 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నాయి.
టీవీఎస్ ఐ-క్యూబ్ ఎస్టీ 3.4 కిలోవాట్ల వేరియంట్ సింగిల్ చార్జింగ్ చేస్తే 100 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. రెండు గంటల 50 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది.
మరోవైపు 5.1 కిలోవాట్ల టీవీఎస్ ఐ-క్యూబ్ ఎస్టీ స్కూటర్ సింగిల్ చార్జింగ్ చేస్తే గరిష్టంగా 150 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. నాలుగు గంటల 18 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ చార్జింగ్ అవుతుంది.
ఐ-క్యూబ్ ఎస్టీ 7-అంగుళాల కలర్ టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ ప్లే, టీపీఎంఎస్, కనెక్టెడ్ ఫీచర్లు, 32 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. 3.4 కిలోవాట్ల ఐ-క్యూబ్ ఎస్టీ వేరియంట్ గరిష్టంగా గంటకు 78 కి.మీ వేగంతో ప్రయాణిస్తే, 5.1 కిలోవాట్ల ఐ-క్యూబ్ ఎస్టీ వేరియంట్ గరిష్టంగా 82 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. రెండు వేరియంట్లు నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. కాపర్ బ్రాంజ్ మ్యాట్టె, కోరల్ శాండ్ శాటిన్, టైటానియాం గ్రే మ్యాట్టె, స్టార్ లైట్ బ్లూ కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది.
న్యూ ఎంట్రీ లెవల్ 2.2 కిలోవాట్ల టీవీఎస్ ఐ-క్యూబ్ స్కూటర్ 5 అంగుళాల కలర్ టీఎఫ్టీ స్క్రీన్‌తో వస్తుంది. వెహికల్ క్రాష్, టోయ్ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నేవిగేషన్, 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీ స్పేస్ కలిగి ఉంటుంది. ఇక రెండు కలర్ ఆప్షన్లు – వాల్ నట్ బ్రౌన్, పెరల్ వైట్ రంగుల్లో లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

